Explore

Search

November 7, 2026 6:31 pm

మున్సిపాలిటీలో ఓటర్ల జాబితా రచ్చ – రంగంలోకి బిఎస్‌పి

చంటి ఛానల్,బోధన్: మున్సిపాలిటీ ఓటర్ల తుది జాబితాలోని అవకతవకలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బహుజన సమాజ్ పార్టీ (BSP) నాయకులు మంగళవారం మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు షైక్ మహ్మద్ మాట్లాడుతూ.. విడుదలైన జాబితాలో ఒకే పేరుతో రెండు ఓటర్ కార్డులు ఉండటం, మరణించిన వారి పేర్లను తొలగించకపోవడం, ఒక వార్డు ఓటర్లను మరొక వార్డులో చేర్చడం వంటి అనేక పొరపాట్లు ఉన్నాయని విమర్శించారు. ఈ తప్పులను వెంటనే సరిదిద్ది పారదర్శకమైన కొత్త జాబితాను విడుదల చేయాలని, లేనిపక్షంలో పార్టీ తరపున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ అధ్యక్షులు దాడి రమేష్ దాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్