Explore

Search

November 7, 2026 6:31 pm

‘అరైవ్ అలైవ్’ అవగాహన సదస్సు ప్రారంభం

చంటి ఛానల్,బోధన్: పట్టణంలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ‘Arrive Alive’ & ‘Defensive Driving’ అంశాలపై 10 రోజుల అవగాహన కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక ఆర్టీసీ బస్ స్టేషన్‌లో జరిగిన ప్రారంభోత్సవంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, విద్యుత్ శాఖ ఏఈ కృష్ణ, ఏఎంవీఐ శ్రీనివాస్, ఎస్ఐ భాస్కరాచారి, ఎస్‌హెచ్‌వో వెంకటనారాయణ  పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం, రాంగ్ రూట్ డ్రైవింగ్ నివారణ, సెల్ ఫోన్ డ్రైవింగ్ వల్ల కలిగే నష్టాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ ముప్పులపై వాహనదారులకు అవగాహన కల్పించారు. అలాగే సిగ్నల్ జంపింగ్ చేయకుండా ఉండటం, ఆటో డ్రైవర్లు యూనిఫాం ధరించడం, ప్రమాదానికి గురైన వారిని ప్రాథమిక చికిత్సతో కాపాడటం వంటి కీలక అంశాలపై ఆర్టీసీ సిబ్బంది, ఆటో డ్రైవర్లు, లయన్స్ క్లబ్ ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్