చంటి ఛానల్, బోధన్: మండలంలోని కల్దుర్కి గ్రామంలో జనని యూత్ సొసైటీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద, లోకమాత జీజాబాయి జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. యువత శక్తిని నమ్మి, భారత దేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచ నలుమూలలా చాటిచెప్పిన మహనీయుడు వివేకానందుడని, ఆయన నేటి యువతరానికి గొప్ప ఆదర్శమూర్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నరేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ బోరోల్ల జ్యోతి, సెక్రటరీ సునీత, VDC చైర్మన్ గంగాధర్, మాజీ ఉప సర్పంచ్ న్యాలం శ్రీనివాస్, వార్డు సభ్యులు రామ్, మహేష్, అశోక్, చంద్రకాంత్, మోహన్, రమేష్, షేక్ హబీబ్, గ్రామ పెద్దలు బాబు, గౌర్గోండ, మొగులయ్య, శంకర్ రెడ్డితో పాటు జనని యూత్ సభ్యులు బాలు, మహేష్, శివ తదితరులు పాల్గొని నివాళులర్పించారు.

