చంటి ఛానల్,బోధన్: పట్టణంలోని కమ్మ సంఘం కార్యవర్గ నిర్ణయం మేరకు, ఈ నెల 21-12-2025 (ఆదివారం) తేదీన ఉదయం 9:00 గంటలకు సంఘ కార్యాలయ ప్రాంగణంలో సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు సంఘం ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో ప్రధానంగా కార్యదర్శి నివేదిక సమర్పణ, కోశాధికారి ఆర్థిక నివేదిక వెల్లడితో పాటు, సంఘం అధ్యక్షుల సందేశం, ఇతర ముఖ్యమైన అంశాలపై చర్చించనున్నారు. కమ్మ సంఘం సభ్యులందరూ ఈ సమావేశానికి సకాలంలో హాజరై, చర్చల్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంఘం అధ్యక్షుడు పల్లెంపాటి శివన్నారాయణ, ప్రధాన కార్యదర్శి దావులూరి హరినాథ్ బాబు కోరారు.

