Explore

Search

November 7, 2026 6:31 pm

మున్సిపల్ బరిలోకి జనసేన: తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు

చంటి ఛానల్, బోధన్: తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల బరిలో నిలవాలని జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, ప్రధానంగా పట్టణ ప్రాంత ఓటర్లు,యువతపై ఆశలు పెట్టుకున్న జనసేన, ఈ ఎన్నికల ద్వారా తన ఉనికిని చాటుకోవాలని భావిస్తోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ ఇప్పటికే కార్యచరణను సిద్ధం చేస్తూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఏపీలో సాధించిన విజయంతో వచ్చిన ఉత్సాహాన్ని ఇక్కడ కూడా కొనసాగించాలని, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మం, నిజామాబాద్ వంటి ప్రాంతాల్లో ప్రభావం చూపాలని జనసేన లక్ష్యంగా పెట్టుకుంది. కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి వంటి ప్రధాన పార్టీలకు జనసేన ఎంట్రీ ఎంతవరకు సవాల్ విసురుతుందోనన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్