నిజామాబాద్ జిల్లా: బోధన్ పురపాలక కార్యాలయంలో ఈరోజు మున్సిపల్ కమిషనర్ కృష్ణ, డీఈ యోగేష్, ఏఈ శ్రీనివాస్, ఏఈ ముక్యార్ అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పోలింగ్ కేంద్రాలపై సమావేశం నిర్వహించారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ స్టేషన్ల గుర్తింపు, ఓటర్లకు కల్పించాల్సిన సౌకర్యాలపై చర్చించారు. ఎన్నికల నిబంధనల మేరకు పోలింగ్ కేంద్రాల నిర్వహణ ఉంటుందని, రాజకీయ పార్టీలు అధికారులకు సహకరించాలని కోరారు.

