Explore

Search

November 7, 2026 6:52 pm

అంగన్వాడీ సిబ్బందికి సుదర్శన్ రెడ్డి సీరియస్ ఆదేశాలు: “పనితీరులో మార్పు కనిపించాలి”

చంటి ఛానల్ బోధన్: పట్టణంలోని లయన్స్ భవన్ లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొని అంగన్వాడీ కేంద్రాలకు గ్యాస్ పొయ్యిలు, ప్లాస్టిక్ కంటైనర్లను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చొరవతో దీక్షిత్ గ్యాస్ ఏజెన్సీ వారు 113 కేంద్రాలకు ఉచితంగా గ్యాస్ పొయ్యిలను అందించగా, సరుకుల భద్రత కోసం స్థానిక నాయకుడు శరత్ ప్లాస్టిక్ కంటైనర్లను సమకూర్చారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, అంగన్వాడీ సిబ్బంది తమ బాధ్యతను గుర్తించి చిన్నారులు, గర్భిణీలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. కలెక్టర్ త్రిపాఠి మాట్లాడుతూ, మినీ అంగన్వాడీల అప్ గ్రేడేషన్ ద్వారా ప్రభుత్వం మహిళా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి ఒక్కరికీ నాణ్యమైన పౌష్టికాహారం అందేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, వ్యవసాయ కమిషన్ చైర్మన్ గడుగు గంగాధర్, సబ్ కలెక్టర్ వికాస్ మహతో తదితర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్