చంటి ఛానల్,బోధన్: పట్టణంలోని ఇందూర్ ప్రాథమిక పాఠశాలలో గురువారం సంక్రాంతి ముందస్తు వేడుకలను పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతూ భోగి మంటలు, హరిదాసు వేషధారణలు, కోలాటాలు మరియు జానపద నృత్యాలతో అలరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన బోధన్ ఏసిపి శ్రీనివాస, ఎస్సై వెంకటనారాయణ, డీటీఓ ఉమామహేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ.. చిన్నారులకు చిన్ననాటే భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను నేర్పించడం అభినందనీయమని కొనియాడారు. వేడుకలను విజయవంతంగా నిర్వహించిన పాఠశాల కరస్పాండెంట్ కొడాలి కిషోర్, ఉపాధ్యాయులను వారు ప్రత్యేకంగా అభినందించారు.

