చంటి ఛానల్, బోధన్: సంక్రాంతి పండుగ వేళ గాలిపటాలు ఎగురవేసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (NPDCL) ఒక ప్రకటనలో కోరింది. ముఖ్యంగా విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు,సబ్స్టేషన్ల వద్ద గాలిపటాలు ఎగురవేయడం ప్రాణాపాయానికి దారితీస్తుందని హెచ్చరించింది. విద్యుత్ ప్రసరణకు అవకాశం ఉన్న నైలాన్ థ్రెడ్ లేదా చైనీస్ మాంజాను ఎట్టిపరిస్థితుల్లోనూ వాడకూడదని, అలాగే గాలిపటాలు విద్యుత్ తీగలకు చిక్కుకున్నప్పుడు వాటిని లాగడం లేదా తొలగించడానికి ప్రయత్నించడం వంటివి చేయవద్దని స్పష్టం చేసింది. వర్షం పడే సమయంలో గాలిపటాలు ఎగురవేయడం కూడా ప్రమాదకరమని సంస్థ పేర్కొంది. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే వెంటనే 1912 అనే హెల్ప్‌లైన్ నంబర్‌కు సమాచారం అందించాలని, చిన్న పొరపాటు ప్రాణనష్టానికి దారితీసే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని NPDCL సూచించింది.

