Explore

Search

November 7, 2026 6:58 pm

గర్జించనున్న ఖమ్మం: సిపిఐ వందేళ్ల ఉత్సవాలు

చంటి ఛానల్,బోధన్: జనవరి 18న ఖమ్మంలో జరిగే సిపిఐ శత వార్షికోత్సవ ముగింపు బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ బోధన్‌లో పార్టీ గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ మాట్లాడుతూ, వందేళ్ల పోరాట చరిత్ర కలిగిన సిపిఐ సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషించిందని.. నిజాం వ్యతిరేక పోరాటం ద్వారా పేదలకు భూములు పంపిణీ చేసిన ఘనత పార్టీదేనని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను దోచిపెడుతూ పర్యావరణాన్ని ధ్వంసం చేస్తోందని విమర్శిస్తూ, లౌకిక శక్తులన్నీ ఏకమై ఖమ్మం సభకు భారీగా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్