Explore

Search

November 7, 2026 6:44 pm

రోడ్డు భద్రత – జీవన భద్రత: శ్రీనివాస విద్యానికేతన్

చంటి ఛానల్, బోధన్: స్థానిక శ్రీనివాస విద్యానికేతన్ పాఠశాలలో బుధవారం జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, అసిస్టెంట్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు మణికంఠ, పద్మాసంగ్, ట్రస్మా (TRSMA) అధ్యక్షులు హరికృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటం, హెల్మెట్ ధరించడం ప్రాణరక్షణకు ఎంతో కీలకమని వివరించారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్ గుర్రం సంతోష్ మాట్లాడుతూ.. విద్యార్థులు చిన్నతనం నుండే రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకోవాలని, నిబంధనలు పాటించి సురక్షితమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్