Explore

Search

November 7, 2026 6:12 pm

హిందూ వాహిని శోభయాత్రలో సందడి చేసిన బీజేపీ అగ్రనేతలు

చంటి ఛానల్,బోధన్: ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని బోధన్ పట్టణంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో నిర్వహించిన శోభయాత్ర అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక, ఉత్సాహభరిత కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి, వడ్డీ మోహన్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. శివాజీ మహారాజ్ వీరత్వాన్ని స్మరిస్తూ సాగిన ఈ యాత్రలో బీజేపీ సీనియర్ నాయకులు, వివిధ మండలాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. జై శివాజీ నినాదాలతో బోధన్ వీధులు మారుమోగగా, ఈ శోభయాత్ర హిందూ ధర్మ పరిరక్షణకు, యువతలో స్ఫూర్తి నింపడానికి ప్రతీకగా నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్