Explore

Search

November 7, 2026 6:12 pm

​”స్కూల్లో మత రాజకీయం: బోధన్ వైస్ చైర్మన్ హుకుం!”

చంటి ఛానల్ ,బోధన్: పట్టణంలోని ఒక ప్రైవేటు పాఠశాలలో ప్రార్థనల కోసం ప్రత్యేక గదిని కేటాయించాలని ఎంఐఎం టౌన్ ప్రెసిడెంట్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇలియాజ్ యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురావడం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది. పాఠశాల ప్రిన్సిపల్‌ను కలిసి విద్యార్థుల ప్రార్థనల కోసం ‘టెన్ బై టెన్’ గదిని ఏర్పాటు చేయాలని, అందుకు యాజమాన్యం నిరాకరించగా “ఎందుకు చేయరు?” అంటూ ఆయన ప్రశ్నించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారం బయటపడింది. విద్యాసంస్థలను మతాతీత దేవాలయాలుగా భావించాల్సి ఉండగా, ఇలా విద్యార్థులపై మతపరమైన అంశాలను రుద్దడం సరికాదని మేధావి వర్గాలు మరియు హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. రంజాన్ సమయంలో ప్రార్థనల కోసం సమయం కోరడం సాధారణమే అయినా, ఏకంగా పాఠశాల ప్రాంగణంలో గదుల కేటాయింపు కోరడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి పోకడలకు పాల్పడటం సరికాదని, ఒకవేళ ఇలాంటి ఒత్తిళ్లు కొనసాగితే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హిందూ సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్