చంటి ఛానల్,బోధన్: పట్టణంలో లయన్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ‘లయన్స్ జనరల్ దవాఖాన’ ఈ నెల 23 నుంచి అందుబాటులోకి రానుంది. 20 పడకల సామర్థ్యం, ఐసీయూ, 24 గంటల అత్యవసర సేవలతో కూడిన ఈ ఆస్పత్రిలో కేవలం ₹100 కే ఓపీ (OP) సేవలు అందించనున్నారు. పేద ప్రజలకు తక్కువ ధరలో మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ఈ దవాఖానను ఏర్పాటు చేశారు.

