Explore

Search

November 7, 2026 6:32 pm

సీఎం సభ నేపథ్యంలో నిజామాబాద్ వాహనదారులకు కీలక సూచనలు.

చంటి ఛానల్,తెలంగాణ: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 6న నిజామాబాద్‌లోని బర్దిపూర్-కేశపూర్ రోడ్డులో నిర్వహించే సభకు విచ్చేస్తున్న నేపథ్యంలో, ఆ రోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నగరంలో కీలక ట్రాఫిక్ ఆంక్షలు, మార్గ మళ్లింపులు అమలులో ఉంటాయని పోలీస్ కమిషనర్ ప్రకటించారు. సభకు వచ్చే వాహనాల కోసం ఆర్మూర్, డిచ్‌పల్లి మార్గాల నుండి వచ్చే వారు నారాయణ కాలేజీ వద్ద, మాక్లూర్ వైపు నుండి వచ్చే వారు త్రిమూర్తి కోల్డ్ స్టోరేజ్ వద్ద, బోధన్, వర్ని ప్రాంతాల నుండి వచ్చే వారు సుధీర్ రెడ్డి కాలేజీ ఆవరణలో పార్కింగ్ చేయాలని సూచించారు. హైదరాబాద్ నుండి నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ వైపు వెళ్లే సాధారణ ప్రయాణికులకు ఎటువంటి ఆంక్షలు ఉండవని, ప్రజలు, వాహనదారులు పోలీస్ సిబ్బందికి సహకరించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్