చంటి ఛానల్,బోధన్: సాలూర మండలంలోని వివిధ గ్రామాల లబ్ధిదారులకు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు CMRF చెక్కులు అందజేశారు. కష్టకాలంలో తమను ఆదుకున్న ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిలకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంధర్నా రవి, పార్టీ సీనియర్ నాయకులు ఇల్తేపు శంకర్, అల్లే రమేష్, ఖాజాపూర్ అశోక్, సాలురా గ్రామ సర్పంచ్ సోక్కం లావణ్య రవి, ఉప సర్పంచ్ సురేష్, నాయకులు శివ కాంత్, వీరేష్, NSUI ఛిద్రపు అనిల్, గంగాధర్ పాల్గొన్నారు.

