Explore

Search

November 7, 2026 6:12 pm

శివాజీ ఉత్సవాలకు ఆర్మూర్ ఎమ్మెల్యే చీఫ్ గెస్ట్.. ఏర్పాట్లు అదరహో!”

చంటి ఛానల్ ,బోధన్: పట్టణంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేస్తూ, హిందూ ధర్మ రక్షకుడు, వీర శివాజీ జయంతి వేడుకలకు నియోజకవర్గ ప్రజలు, యువకులు మరియు భక్తులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. “బోధన్ కు వస్తున్నా.. మీరు రండి.. ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలను విజయవంతం చేయండి” అంటూ ఆయన పిలుపునిచ్చారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగే శోభాయాత్రలో అందరూ పాల్గొని ఈ ఉత్సవాలను చారిత్రాత్మక విజయవంతం చేయాలని ఆయన ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్