Explore

Search

November 7, 2026 6:52 pm

శక్కర్ నగర్ వెళ్లలేక చస్తున్నాం.. బిజెపి అభ్యర్థి దుర్గాప్రసాద్ ముందు ప్రజల గోడు!

చంటి ఛానల్,బోధన్: పట్టణంలోని 24వ వార్డులో బిజెపి కౌన్సిలర్ అభ్యర్థి దుర్గాప్రసాద్ ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తున్నారు. ప్రచారంలో భాగంగా స్థానికులతో మాట్లాడిన ఆయన, వార్డులో నెలకొన్న సమస్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దశాబ్దాలు గడుస్తున్నా 24వ వార్డులో రేషన్ షాపు ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటని, బియ్యం కోసం ప్రజలు కిలోమీటర్ల దూరంలో ఉన్న శక్కర్ నగర్ వరకు వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్ కష్టాలపై ప్రజలు ‘బాబోయ్’ అంటున్నారని, తనను కౌన్సిలర్‌గా గెలిపిస్తే యుద్ధ ప్రాతిపదికన వార్డులోనే రేషన్ షాపు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి శ్రేణులు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని దుర్గాప్రసాద్‌కు మద్దతు పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్