Explore

Search

November 7, 2026 6:22 pm

వార్డు నెం. 24లో బీఆర్ఎస్ జోరు: “రవీందర్ యాదవ్ నమ్మకాన్ని నిలబెడతా” – అభ్యర్థి హామీ

చంటి ఛానల్,బోధన్: బోధన్ పట్టణంలోని 24వ వార్డులో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి లక్ష్మి ఇంటింటికి తిరుగుతూ ప్రజల ఆశీర్వాదం తీసుకుంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా అభ్యర్థి లక్ష్మి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో అవకాశం కల్పించిన రవీందర్ యాదవ్ పరువును నిలబెడతానని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ వార్డు అభివృద్ధికి అంకితమవుతానని ప్రతిజ్ఞ చేశారు. వార్డులో నెలకొన్న డ్రైనేజీ సమస్యలు, సీసీ రోడ్ల నిర్మాణం, నల్లా కనెక్షన్లు, అర్హులకు పెన్షన్లు అందేలా చూస్తానని స్పష్టం చేశారు. “వార్డు ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేరుగా నా వద్దకే రావొచ్చు, 24 గంటలు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను” అని భరోసా ఇచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని వార్డును గులాబీ మయం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్