Explore

Search

November 7, 2026 6:12 pm

రౌడీషీటర్ ‘బర్సాత్ అమేర్’ నగర బహిష్కరణ

చంటి ఛానల్,నిజామాబాద్: నగరంలో వరుస నేరాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న రౌడీషీటర్ బర్సాత్ అమేర్ (అమీర్ అలీ ఖాన్) పై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్. కఠిన చర్యలు తీసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ మరియు రానున్న ఎన్నికల దృష్ట్యా, అమేర్‌ను నిజామాబాద్ జిల్లా నుండి ఒక సంవత్సరం పాటు బహిష్కరిస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.ఆటో నగర్‌కు చెందిన అమేర్ గత ఆరేళ్లుగా 22 నేరాల్లో నిందితుడిగా ఉన్నాడని, గతంలో పీడీ యాక్ట్ ప్రయోగించినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదని పోలీసులు తెలిపారు. “హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్-1348 ఫస్లీ” లోని సెక్షన్ 26(1)(a) ప్రకారం ఈ బహిష్కరణ వేటు వేశారు. జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఈ సందర్భంగా సీపీ హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్