Explore

Search

November 7, 2026 6:45 pm

రాష్ట్ర స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనలో ఇందూర్ బి.ఎడ్ విద్యార్థినుల విజయం

చంటి ఛానల్,కామారెడ్డి: విద్యానికేతన్ హై స్కూల్‌లో జరిగిన 53వ రాష్ట్ర స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనలో ఇందూర్ బి.ఎడ్ కాలేజీ విద్యార్థినులు ప్రవళిక, వెన్నెల విజేతలుగా నిలిచారు. వీరు ప్రదర్శించిన “సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు” (SDG) ప్రాజెక్టుకు విశేష స్పందన లభించగా, ఎమ్మెల్యే వెంకట రమణ రెడ్డి, ఎమ్మెల్సీ అంజి రెడ్డి గార్ల చేతుల మీదుగా బహుమతులు అందుకున్నారు. గైడ్ అవినాష్ పర్యవేక్షణలో జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థినులను కళాశాల ప్రిన్సిపాల్ అప్పల నాయుడు, మేనేజ్మెంట్ కృష్ణ రావు, ప్రదీప్ రెడ్డి, సిబ్బంది అభినందించారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్