చంటి ఛానల్,బోధన్: మున్సిపాలిటీలో 38 వార్డులకు జరిగిన ఎన్నికలు అత్యంత ఉత్కంఠను రేపుతున్నాయి. ఈ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 17 వార్డులను కైవసం చేసుకోగా, స్థానిక ఎమ్మెల్యే ఎక్స్-అఫీషియో ఓటు, గెలిచిన ఏకైక స్వతంత్ర అభ్యర్థి మద్దతుతో కాంగ్రెస్ బలం 19కి చేరింది. అయితే, చైర్మన్ పదవిని దక్కించుకోవడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 20 కావడం వల్ల, కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక్క ఓటు దూరంలో నిలిచింది. ఎంపీ ఓటు అందుబాటులో లేకపోవడంతో, చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి ఆ ఒక్క ఓటు ఎవరి నుంచి వస్తుందనేది ఇప్పుడు బోధన్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

