Explore

Search

November 7, 2026 6:23 pm

మేయర్ పీఠం దిశగా కమలం.. కాంగ్రెస్‌కు చుక్కెదురు!

చంటి ఛానల్,నిజామాబాద్: నగర కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ అత్యధికంగా 29 డివిజన్లలో జయకేతనం ఎగురవేసి అతిపెద్ద పార్టీగా అవతరించింది. అధికార కాంగ్రెస్ పార్టీ 18 స్థానాలకే పరిమితం కాగా, ఎంఐఎం 12 డివిజన్లలో తన పట్టును చాటుకుంది; అయితే గతంలో కీలకంగా ఉన్న బీఆర్ఎస్ కేవలం ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా 2 నుండి 8 వరకు 22 నుండి 28 వరకు వరుస డివిజన్లలో బీజేపీ క్లీన్ స్వీప్ చేయగా, మైనారిటీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఎంఐఎం తన ఉనికిని కాపాడుకుంది. ఈ ఫలితాలతో నిజామాబాద్ నగర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది, మేయర్ పీఠంపై బీజేపీ గురి పెట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్