Explore

Search

November 7, 2026 6:07 pm

మెల్విన్ జోన్స్ ఆశయ సాధనే లక్ష్యం: ఐ హాస్పిటల్‌లో ఘన నివాళి

చంటి ఛానల్,బోధన్: లయన్స్ క్లబ్ అంతర్జాతీయ వ్యవస్థాపకుడు మెల్విన్ జోన్స్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని, లయన్స్ క్లబ్ ఆఫ్ భవానీ ఆదర్శ్ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం స్థానిక ఐ హాస్పిటల్ ప్రాంగణంలో ఉన్న మెల్విన్ జోన్స్ విగ్రహానికి క్లబ్ ప్రతినిధులు పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో రీజియన్ చైర్మన్ లయన్ పావులూరి వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ.. సమాజ సేవలో లయన్స్ క్లబ్ పాత్ర మరువలేనిదని కొనియాడారు. కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ శ్రీరామ్ అశోక్, సెక్రెటరీ నల్లూరి లక్ష్మీకాంత్, ట్రెజరర్ బండ్ల వెంకట్రావుతో పాటు సభ్యులు లయన్ పుల్లెల వెంకటరమణ, కొడాలి శశిధర్, పావులూరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్