Explore

Search

November 7, 2026 6:22 pm

మున్సిపల్ రిజర్వేషన్ల ఖరారుకు రాజకీయ పార్టీలతో సమావేశం

చంటి ఛానల్,నిజామాబాద్: జిల్లాలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియపై జిల్లా కలెక్టర్ శనివారం (జనవరి 17) రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో ఈ సమావేశం జరగనుంది. వార్డుల వారీగా ఎస్టీ, ఎస్సీ, బీసీ మరియు మహిళా రిజర్వేషన్లను ఖరారు చేసే క్రమంలో, మహిళా రిజర్వేషన్లను డ్రా ఆఫ్ లాట్స్ పద్ధతిలో పార్టీ ప్రతినిధుల సమక్షంలో ఎంపిక చేస్తారు. ఉదయం 10:00 గంటలకు భీమ్గల్, 10:15కు ఆర్మూర్, 10:30కు బోధన్ మున్సిపాలిటీలకు, ఉదయం 11:00 గంటలకు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించి సమయాలను కేటాయించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరుకావాలని జిల్లా ఎన్నికల విభాగం ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్