నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీ సాధారణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల పరిశీలన ముగిసింది. మొత్తం 38 వార్డులకు గాను 342 నామినేషన్లు దాఖలు కాగా, వివిధ కారణాలతో 5 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. తుది పరిశీలన అనంతరం 255 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు ఎన్నికల అధికారులు ధృవీకరించారు. పార్టీల వారీగా చూస్తే.. అత్యధికంగా కాంగ్రెస్ (INC) నుండి 81, బీఆర్ఎస్ (BRS) నుండి 65, ఏఐఎంఐఎం (AIMIM) నుండి 47, మరియు బీజేపీ (BJP) నుండి 33 నామినేషన్లు చెల్లుబాటు అయ్యాయి. వీటితో పాటు బీఎస్పీ 3, ఆప్ 2, సీపీఐ(ఎం) 2, ఇతర రిజిస్టర్డ్ పార్టీల నుండి 7, 15 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న 237 మంది అభ్యర్థులలో ఎవరైనా నామినేషన్లు ఉపసంహరించుకుంటారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

