చంటి ఛానల్ ,బోధన్: మున్సిపల్ ఎన్నికల ఉత్కంఠకు తెరపడుతూ, తూము పద్మావతి వరుసగా రెండోసారి మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికై తన పీఠాన్ని నిలబెట్టుకున్నారు. ఈమె పేరును కౌన్సిలర్ తూము శరత్ రెడ్డి ప్రతిపాదించగా, వైస్ చైర్మన్‌గా మీర్ ఇలియాస్ ఆలీ ఎన్నికయ్యారు. గత కొంతకాలంగా బోధన్ మున్సిపాలిటీలో నెలకొన్న రాజకీయ అనిశ్చితికి ఈ తాజా ఎన్నికతో ముగింపు పలికినట్లయింది.

