చంటి ఛానల్ ,బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా నూతనంగా ఎన్నికైన పద్మ శరత్ రెడ్డి ని లయన్స్ క్లబ్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపి, శాలువాతో ఘనంగా సత్కరించారు. పట్టణ అభివృద్ధిలో తమ వంతు సహకారం ఉంటుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు బసవేశ్వర రావు, నరసింహారెడ్డి, ప్రతాప్ గుప్తా, శ్రీనివాసరావు, పంట నాగేశ్వర్ రావు, ఉమేష్, విజయ్ కుమార్, పండు, శశి తదితరులు పాల్గొన్నారు.

