Explore

Search

November 7, 2026 6:32 pm

ముగిసిన నామినేషన్ల పర్వం.. మొత్తం 342 దరఖాస్తులు!

చంటి ఛానల్,బోధన్: బోధన్ మున్సిపాలిటీలో ఎన్నికల సందడి తారస్థాయికి చేరింది. శుక్రవారం నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. మొత్తం 38 వార్డులకు గాను నేడు ఒక్కరోజే 270 నామినేషన్లు దాఖలు కాగా, ఇప్పటివరకు అందిన మొత్తం నామినేషన్ల సంఖ్య 342కు చేరుకుంది. పార్టీల వారీగా చూస్తే కాంగ్రెస్ (INC) నుండి అత్యధికంగా 112 మంది, బీఆర్ఎస్ (BRS) నుండి 90, ఎంఐఎం (AIMIM) నుండి 62, బీజేపీ (BJP) నుండి 43 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. స్వతంత్ర అభ్యర్థులుగా 19 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అత్యధికంగా 9, 22 వార్డులలో ఒక్కో వార్డుకు 18 చొప్పున నామినేషన్లు దాఖలు కావడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్