Explore

Search

November 7, 2026 6:12 pm

మానసిక వికలాంగురాలిపై అఘాయిత్యం: నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని VHPS డిమాండ్!

చంటి ఛానల్ ,బోధన్: మండలంలోని ఒక గ్రామంలో మానసిక వికలాంగురాలైన యువతిపై ఆటో డ్రైవర్ ఇతియాజ్ అఘాయిత్యానికి పాల్పడటంపై వికలాంగ హక్కుల పోరాట సమితి (VHPS) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గత సోమవారం ఒంటరిగా ఉన్న యువతిని బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని శివారు ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టగా, స్థానికులు గమనించి ఆమెను విడిపించారు. ఈ ఘటనపై స్పందించిన VHPS జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ మరియు ఇతర సంఘాల నేతలు బోధన్ సిఐ, ఎస్సైలను కలిసి నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం చేస్తూ నిందితుడిపై వికలాంగుల రక్షణ చట్టం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులతో పాటు అత్యాచారం కేసులు నమోదు చేయాలని, బాధితురాలి కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నాలను సహించేది లేదని, న్యాయం జరగని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని వారు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్