Explore

Search

November 7, 2026 6:52 pm

బీజేపీలోకి మైనార్టీల క్యూ!

చంటి ఛానల్,బోధన్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ వ్యూహాన్ని వేగవంతం చేసింది. పట్టణంలోని MPR కార్యాలయంలో నిర్వహించిన అభ్యర్థుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి, మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. 22 వార్డులలోనూ విజయమే లక్ష్యంగా శ్రమించాలని, కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన పలువురు మైనార్టీలు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరడం విశేషం. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ కుర్లే శ్రీధర్, పట్టణ అధ్యక్షులు పసులోటి గోపి కిషన్, మాజీ అధ్యక్షులు కొలిపాక బాలరాజుతో పాటు వివిధ మండలాల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్