చంటి ఛానల్, సాలురా: నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూర గ్రామంలో రేపు (బుధవారం) ఉదయం 10:00 గంటలకు క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభం కానుంది. మాజీ సొసైటీ చైర్మన్ అల్లే జనార్ధన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ క్రీడా పోటీలకు ముఖ్య అతిథిగా బోధన్ ఏసీపీ శ్రీనివాస్ హాజరై టోర్నమెంట్ను ప్రారంభించనున్నారు. బోధన్,సాలూర మండలాల పరిధిలోని క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ పోటీలను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రారంభోత్సవ వేడుకకు మండలంలోని వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు,రాజకీయ నాయకులు, క్రీడాకారులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని అల్లే జనార్ధన్ కోరారు.

