Explore

Search

November 7, 2026 6:12 pm

బాలికల భద్రతే ముఖ్యం.. నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించం: జిల్లా కలెక్టర్

చంటి ఛానల్,బోధన్: అమ్దాపూర్‌లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని (KGBV) జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసి, విద్యార్థినుల భద్రత మరియు వసతులపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలోని తరగతి గదులు, రిజిస్టర్లు మరియు భోజన మెనూను పరిశీలించిన కలెక్టర్, విద్యార్థినులకు నాణ్యమైన పౌష్టిక ఆహారం అందించాలని, ముఖ్యంగా బయటి వ్యక్తులను లోనికి అనుమతించకుండా భద్రత విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇటీవల బాన్సువాడలో జరిగిన ప్రమాదాన్ని గుర్తు చేస్తూ, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ఆమె.. స్వయంగా ఎనిమిదో తరగతి విద్యార్థినులకు పాఠాలు బోధించి, చాక్లెట్లు పంపిణీ చేసి వారిలో ధైర్యాన్ని నింపారు. పాఠశాలకు తక్షణమే ప్రహారీ గోడ నిర్మాణం, విద్యుత్ వైరింగ్ మరమ్మతులు చేపట్టాలని సబ్ కలెక్టర్ వికాస్ మహతో, విద్యాశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్