Explore

Search

November 7, 2026 6:12 pm

​పదవి పిచ్చితో కన్నకూతురిని నిజాంసాగర్ కాలువలో పడేసిన తండ్రి.

చంటి ఛానల్, బోధన్: మహారాష్ట్రలో జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేసేందుకు కన్నకూతురినే చంపిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్ర ముఖేడ్ తాలూకాకు చెందిన పాండురంగ అనే వ్యక్తికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే మహారాష్ట్ర ఎన్నికల నిబంధనల ప్రకారం ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అనర్హత ఉంటుందని భావించి, ప్రస్తుత సర్పంచ్ గణేష్ షిండేతో కలిసి పాండురంగ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. తన పెద్ద కూతురు ప్రాచి (06) ని మాయమాటలతో బైక్‌పై నిజామాబాద్ జిల్లా ఎడపల్లి శివారుకు తీసుకువచ్చి, నిజాంసాగర్ కాలువలో ప్రాణంతో ఉండగానే తోసివేసి హత్య చేశాడు. వాట్సాప్ స్టేటస్ ద్వారా పాప ఆచూకీని కనిపెట్టిన నిజామాబాద్ పోలీసులు, నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్