Explore

Search

November 7, 2026 6:12 pm

పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలి – CP సాయి చైతన్య

చంటి ఛానల్, నిజామాబాద్: వచ్చే ఉగాది, హోలీ, రంజాన్ పండుగలను దృష్టిలో ఉంచుకుని నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో సిపి సాయి చైతన్య ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశం జరిగింది. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల మత పెద్దలతో నిర్వహించిన ఈ భేటీలో సిపి మాట్లాడుతూ.. జిల్లా గంగా-జమునా తెహజీబ్‌కు నిదర్శనమని, అందరూ సోదరభావంతో పండుగలు జరుపుకోవాలని కోరారు. రంజాన్ ప్రార్థనల సమయంలో తగిన భద్రత, ట్రాఫిక్ చర్యలు చేపడుతున్నామని, సోషల్ మీడియా వదంతులను నమ్మవద్దని సూచించారు. రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏ సమస్య వచ్చినా డయల్ 100 లేదా స్థానిక పోలీసులను సంప్రదించాలని, శాంతిభద్రతల పరిరక్షణలో మత పెద్దలు ప్రజలను చైతన్యం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ బస్వా రెడ్డి, ఏసీపీలు ప్రకాష్, శ్రీనివాస్, వెంకట్ రెడ్డి, మస్తాన్ అలీ, ఇన్ స్పెక్టర్ శ్రీశైలం పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్