చంటి ఛానల్,నిజామాబాద్: సెక్యూరిటీ కౌన్సిల్‌లో నార్కోటిక్స్ విభాగానికి జాయింట్ సెక్రటరీగా వి.దుష్యంత్ నేడు బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ డీజీపీ బి. శివధర్ రెడ్డి (IPS), ఐజీపీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి (IPS), నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య (IPS) వంటి ప్రముఖ అధికారుల సమక్షంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దుష్యంత్ మాట్లాడుతూ.. సమాజాన్ని మాదకద్రవ్య రహితంగా మార్చేందుకు, ప్రజా భద్రతను పటిష్టం చేసేందుకు తమ బృందం సమిష్టిగా కృషి చేస్తుందని తెలిపారు. ఈ ముఖ్యమైన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రజల సహకారం కూడా అవసరమని ఆయన కోరారు.

