Explore

Search

November 7, 2026 6:12 pm

ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు: “హిందువులారా.. జనాభాను పెంచండి – ఒక్కరు ఇద్దరు సరిపోరు!”

చంటి ఛానల్, బోధన్: పట్టణంలోని రాకసిపేట్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు హిందూవాహిని ఆధ్వర్యంలో శోభాయాత్ర అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. రెడ్డి, కాపు, వెలమ, మాల, మాదిగ, ముదిరాజ్ వంటి అన్ని కులాల వారు ప్రాథమికంగా హిందువులేనని, కులాలకు అతీతంగా హిందువులందరూ సంఘటితం కావాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. హిందువులు ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ, తమ సనాతన ధర్మాన్ని తప్పనిసరిగా పాటించాలని, “ఒక్కరు లేదా ఇద్దరు పిల్లలు చాలు” అనే ఆలోచనను పక్కన పెట్టి హిందువుల జనాభాను పెంచుకోవాలని సూచించారు. ప్రతి ఇంటి నుండి ఒక మోదీని, ఒక యోగిని తయారు చేస్తామని పేర్కొంటూ, అక్బరుద్దీన్ ఓవైసీ గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ హిందూ సమాజంలోని ఐక్యత ఎంత అవసరమో ఈ సందర్భంగా వారు ఉద్ఘాటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్