Explore

Search

November 7, 2026 5:57 pm

చిన్నారుల చెంతకు సంక్రాంతి పసందు.. గాలిపటాలు పంచిన జనని యూత్!

చంటి ఛానల్,బోధన్: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మండలంలోని కల్దుర్కి గ్రామంలో జనని యూత్ సొసైటీ ఆధ్వర్యంలో చిన్నారులకు ఉచితంగా గాలిపటాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా గ్రామ ప్రజలందరూ భోగభాగ్యాలతో, కొత్త కాంతులతో సంక్రాంతి, కనుమ పండుగలను ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షించారు. చిన్నారుల ముఖాల్లో చిరునవ్వులు నింపాలనే లక్ష్యంతో యూత్ సొసైటీ ఈ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బోరోల్ల జ్యోతి (శంకర్), మాజీ ఉప సర్పంచ్ న్యాలం శ్రీనివాస్, వార్డు సభ్యులు రామ్, మహేష్, అశోక్, జనని యూత్ సభ్యులు భాస్కర్ రెడ్డి, బాలు, మహేష్, పవన్, చందు, రామ్, శివ, రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్