చంటి ఛానల్, బోధన్: మున్సిపాలిటీ 38 వార్డుల ఫలితాలు వెలువడటంతో ‘చంటి ఛానల్’ క్షేత్రస్థాయిలో నిర్వహించిన ముందస్తు సర్వే అక్షరాలా నిజమైంది. మన ఛానల్ అంచనా వేసినట్లుగానే కాంగ్రెస్ పార్టీ 17 వార్డులను కైవసం చేసుకుని ప్రభంజనం సృష్టించగా, ఎంఐఎం (MIM) 12 స్థానాలతో గట్టి పోటీని ఇచ్చింది. ఇక బీఆర్ఎస్ (TRS) 5 స్థానాలకు, బీజేపీ (BJP) 3 స్థానాలకు పరిమితం కాగా, 16వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ప్రజల నాడిని పక్కాగా పట్టుకోవడంలో, ఓటర్ల మనోగతాన్ని ముందే ఊహించడంలో ‘చంటి ఛానల్’ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. ఇప్పుడు ఈ ఫలితాలతో మున్సిపల్ పీఠంపై హస్తం పార్టీ పట్టు సాధించడం ఖాయమని తేలిపోయింది.

