Explore

Search

November 7, 2026 6:12 pm

గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్: 1.265 కిలోల గంజాయి స్వాధీనం

చంటి ఛానల్​,బోధన్: పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఆదివారం (ఫిబ్రవరి 2, 2026) మధ్యాహ్నం రవిగార్డెన్ బైపాస్ రోడ్డు వద్ద పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా, అనుమానాస్పదంగా వెళ్తున్న యాక్టివా స్కూటర్ (TS16EE3613)ను ఆపి తనిఖీ చేశారు. ఈ క్రమంలో డిక్కీలో దాచిన 1.265 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు రాకాసిపేట్‌కు చెందిన మహమ్మద్ అష్రఫ్ అలీ (42) అని, ఇతడు మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన ఫిరోజ్మ, షేక్ మాజిద్ అనే వ్యక్తుల నుంచి గంజాయిని కొనుగోలు చేసి, ఇక్కడ స్థానిక యువతకు, కాలేజీ విద్యార్థులకు, కూలీలకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. నిందితుడిపై NDPS చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు, గంజాయితో పాటు మూడు సెల్ ఫోన్లు, స్కూటర్‌ను సీజ్ చేశారు. ఈ ఆపరేషన్‌లో చాకచక్యంగా వ్యవహరించిన బోధన్ టౌన్ ఎస్.హెచ్.వో వి. వెంకట నారాయణ, సిబ్బందిని నిజామాబాద్ నగర పోలీస్ కమిషనర్ అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్