చంటి ఛానల్, బోధన్: బెల్లల్ గ్రామంలోని వార్డు సభ్యుల సమిష్టి ఆధ్వర్యంలో చిన్నపిల్లల కోసం వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. పిల్లల్లో క్రీడా స్ఫూర్తిని నింపి, వారిని భవిష్యత్తు ఆశాకిరణాలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ పోటీలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అన్నపూర్ణ నీలకంఠం గౌడ్, మాజీ సర్పంచ్ సంజీవ్, మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. వార్డు సభ్యులు రూప్ సింగ్, మల్లేష్, సెమిన్స్, చిన్ను సహా స్థానిక యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు. చిన్నతనం నుంచే క్రీడల పట్ల ఆసక్తి పెంచడం వల్ల వారు క్రమశిక్షణ గల యువకులుగా ఎదుగుతారని నిర్వాహకులు ఈ సందర్భంగా తెలియజేశారు.

