చంటి ఛానల్ ,బోధన్: పట్టణంలోని 15వ వార్డు కౌన్సిలర్ గుమ్ముల అశోక్ రెడ్డిని బోధన్ లయన్స్ క్లబ్ సభ్యులు ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన సామాజిక సేవలను కొనియాడుతూ సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో బసవేశ్వర్, పెంట నాగేశ్వరరావు, ఉమేష్ షిండే, ప్రతాప్ గుప్తా, పండు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో అభినందించిన లయన్స్ క్లబ్ సభ్యులకు, ప్రతి ఒక్కరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

