చంటి ఛానల్,బోధన్: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లాలోని బోధన్, వర్ని, కోటగిరి, రుద్రూర్,పోతంగల్ మండలాల్లో కోళ్ల పందేలకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన ఈ సంప్రదాయం ఇక్కడ జూదంగా మారి, లక్షలాది రూపాయల చేతులు మారే స్థాయికి చేరుకుంది. పోలీసులు నిషేధం విధించినప్పటికీ, నిర్వాహకులు రహస్య ప్రాంతాల్లో పందేలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు; ఇప్పటికే మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలకు పందెం కోళ్లను తరలించినట్లు సమాచారం. ఒకవైపు పోలీసులు పందెం రాయుళ్లకు బైండోవర్ నోటీసులు ఇస్తుండగా, మరోవైపు ఈసారి పందేలను అడ్డుకుంటారా లేదా గతంలోలాగే చూసీచూడనట్లు వ్యవహరిస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది.

