Explore

Search

November 7, 2026 6:12 pm

కోప్పర్గలో ఘనంగా ఉచిత వైద్య శిబిరం: సామాజిక సేవకులు జమీల్ పటేల్ కృషి

చంటి ఛానల్,బోధన్: కోప్పర్గ గ్రామంలో సామాజిక సేవకులు జమీల్ పటేల్ ఆధ్వర్యంలో శ్రీ గురు రాఘవేంద్ర సన్ రైస్ ఆసుపత్రి వైద్యుల సహకారంతో పేద ప్రజల కోసం ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో వైద్యులు రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను పంపిణీ చేశారు. గ్రామంలోని పేదల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జమీల్ పటేల్‌ను గ్రామస్తులు కొనియాడారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు, వైద్య సిబ్బంది, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్