Explore

Search

November 7, 2026 6:12 pm

కోటపై కవిత కన్ను: మేధావులతో మైండ్ గేమ్!

చంటి ఛానల్ ,బోధన్: నియోజకవర్గ రాజకీయాల్లో సంచలన మార్పులు చోటుచేసుకోనున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బోధన్ నుండి పోటీ చేసేందుకు ఎమ్మెల్సీ కవిత పక్కా వ్యూహంతో సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆమె నియోజకవర్గంలోని మేధావి వర్గంతో వరుసగా అంతర్గత సమావేశాలు నిర్వహిస్తూ, స్థానిక సమస్యలు, రాజకీయ సమీకరణాలపై లోతైన చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కేవలం పార్టీ శ్రేణులతోనే కాకుండా, సమాజంలోని విద్యావంతుల మద్దతును కూడా కూడగడుతూ తన గెలుపు గుర్రాన్ని సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ పరిణామాలు బోధన్ రాజకీయాల్లో కవితా మార్క్ వ్యూహానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్