Explore

Search

November 7, 2026 6:32 pm

కాంగ్రెస్ కిడ్నాప్ రాజకీయాలపై షకీల్ ఫైర్: బోధన్ మున్సిపల్ పీఠమే లక్ష్యం!

చంటి ఛానల్,బోధన్: మున్సిపల్ ఎన్నికల వేళ మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ తన రాజకీయ వ్యూహానికి పదును పెడుతూ మొత్తం 38 వార్డులకు బిఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు దొరకడం లేదని, ఆ పార్టీలో ఉన్న వారంతా గతంలో బిఆర్ఎస్ నుంచి గెలిచిన వారేనని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులు తమ పార్టీ కార్యకర్తలను బెదిరింపులకు గురిచేస్తున్నారని, పోటీ చేయకుండా అడ్డుకుంటూ చివరకు పిల్లలను కిడ్నాప్ చేస్తామనే స్థాయికి దిగజారారని తీవ్రంగా ఆరోపించారు. ఇదే క్రమంలో సుదర్శన్ రెడ్డిని తెలంగాణలోనే అతిపెద్ద ఇసుక డాన్‌గా అభివర్ణించిన షకీల్, ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, మున్సిపల్ పీఠమే లక్ష్యంగా బిఆర్ఎస్ సైనికులు కష్టపడి పార్టీని భారీ మెజారిటీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్