Explore

Search

November 7, 2026 6:32 pm

కల్దుర్కిలో ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు

చంటి ఛానల్,బోధన్: కల్దుర్కి గ్రామ నియోజకవర్గ పరిధిలోని కల్దుర్కి గ్రామంలో జనని యూత్ సొసైటీ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం వక్తలు మాట్లాడుతూ.. స్వాతంత్య్ర కాంక్షను రగిలించిన సూర్యుడని, జయంతే తప్ప వర్ధంతి లేని అమరుడు నేతాజీ అని కొనియాడారు. ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించి ఆంగ్లేయుల గుండెల్లో నిద్రపోయిన వీరపుత్రుడని, భారత స్వాతంత్య్ర సాధనే ధ్యేయంగా తపించిన భరతమాత ముద్దుబిడ్డ అని ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ బోరోల్ల జ్యోతి శంకర్, వార్డు సభ్యులు చంద్రకాంత్, మహేష్, అశోక్, రాజు, హన్మండ్లు, VDC చైర్మన్ గంగాధర్, మాజీ సర్పంచ్ మారయ్య, మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్, గ్రామ పెద్దలు భాస్కర్ రెడ్డి, సాయిలు, ధర్మయ్యలతో పాటు జనని యూత్ సభ్యులు పవన్, బాలు, రామ్, సతీష్, గంగాధర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్