చంటి ఛానల్,బోధన్: పట్టణంలోని చారిత్రాత్మక శ్రీ చక్రేశ్వర శివ మందిరంలో 2026 మహాశివరాత్రి పురస్కరించుకుని నిర్వహించే జాతర ఉత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు బోధన్ కలెక్టర్ ని కలిసి, ఉత్సవాలకు సాదరంగా ఆహ్వానిస్తూ జాతర విజయవంతానికి తగు సూచనలు, సలహాలు ఇవ్వవలసిందిగా కోరారు. అనంతరం బోధన్ ఎస్.హెచ్.వో (SHO) ని కలిసి జాతర ఆహ్వాన పత్రికను అందజేయడంతో పాటు, భారీగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని విన్నవించారు. ఈ క్రమంలో అధికారులకు స్వామివారి శేష వస్త్రంతో ఘనంగా సన్మానం చేసి, తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రాములు, అర్చకులు గణేష్ శర్మ, మహేష్ పాఠక్ తదితరులు పాల్గొన్నారు.

