చంటి ఛానల్,బోధన్: పట్టణ శివారులోని కమ్మ సంఘ భవనంలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల్లో కమ్మ సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా పల్లెంపాటి శివన్నారాయణ, కార్యదర్శిగా దావులూరి హరినాథ్ బాబు ఎన్నికయ్యారు. మిగిలిన కార్యవర్గ సభ్యులుగా కోశాధికారి పల్లెంపాటి శ్రీధర్, ఉపాధ్యక్షులుగా డాక్టర్ వెనిగళ్ళ సునిల్ కుమార్ చౌదరి, వెలగ తిలక్, అడి నారాయణ, సంయుక్త కార్యదర్శులుగా యలవర్తి రవీంద్రబాబు, శ్రీ రెడ్డి వెంకటేశ్వరరావు, మద్దినేని శ్రీనివాసరావులు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో బోధన్, వర్ని, కోటగిరి సహా పలు మండలాల ప్రతినిధులు పాల్గొని నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు.

