Explore

Search

November 7, 2026 6:12 pm

కన్న కూతురిని కడతేర్చిన కసాయి తండ్రి: ఎడపల్లి కెనాల్‌లో చిన్నారి మృతదేహం!

చంటి ఛానల్,నిజామాబాద్: ఎడపల్లి మండలం ఏఆర్పీ క్యాంప్ గ్రామ పరిధిలోని D-46 కెనాల్‌లో ఓ చిన్నారి మృతదేహం లభ్యం కావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతురాలిని మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ముద్కేడ్ తాలూకా కేలూర్ గ్రామానికి చెందిన ఆరేళ్ల ప్రాచిగా పోలీసులు గుర్తించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో కన్న తండ్రి పాండురంగే తన కుమార్తెను అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు తేలింది. అయితే, అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన కూతురిని తండ్రి ఎందుకు హతమార్చాడనే కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని, హత్యకు గల అసలు కారణాలను తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్